![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 లో పదమూడో వారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉండగా ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ మినహా అందరు నామినేషన్లో ఉన్నారు. నిన్నటి నామినేషన్ లో డీమాన్ చేసిన నామినేషన్ లో పెద్దగా వ్యాలిడ్ పాయింట్లు లేవు. కానీ భరణి చేసిన రెండు నామినేషన్లు వ్యాలిడ్ గా అనిపించాయి.
భరణి తన మొదటి నామినేషన్ గా సంజనని చేశాడు. తన ట్యాబ్లెట్స్ దాచేసి ఫ్రాంక్ చేద్దామని అనుకున్నావంటు తన నామినేషన్ రీజన్ చెప్పగా జస్ట్ సరదాగా చేశానని సంజన అంది. ఇక ఆ తర్వాత డీమాన్ పవన్ ని తన సెకెండ్ నామినేషన్ గా చేశాడు భరణి. ఇక అందులో తన రీజన్లు చెప్పాడు భరణి. నిన్ను ఏదైతే వెనక్కి లాగుతుందో దాన్ని తీసి పక్కనపెట్టు అని డీమాన్‌కి భరణి చెప్పాడు. ఎప్పుడైతే మనం మెంటల్‌గా ఫోకస్డ్‌గా ఉండలేమో.. ఫిజికల్‌గా కూడా ఉండలేమని భరణి అన్నాడు. నేను రీతూతో ఉండొద్దు అని చెప్పడం లేదు.. హౌస్ లో ప్రతీ ఒక్కరికి బాండింగ్ ఉంటుంది. దానిని నేను తప్పు పట్టడం లేదు.. దానిని తప్పు అని అనుకున్న వారిది తప్పు అంటూ భరణి అన్నాడు.
భరణి చెప్పిన నామినేషన్ రీజన్లకి డీమాన్ పవన్ కంప్లీట్ గా అర్థం చేసుకున్నాడు. ఒకే అన్న అంటూ ఆక్సెప్ట్ చేశాడు. ఇక కాసేపటికి నేను ప్రతి ఒక్కరికీ ఛాలెంజ్ చేసి చెప్తున్నా.. ఈవారం టికెట్ టు ఫినాలే కొట్టేది నేనే.. మార్క్ మై వర్డ్స్ అంటూ డీమాన్ పవన్ ఛాలెంజ్ చేశాడు. ఇక అది చూసి అందరు వీడేంట్రా బాబు అనుకున్నారు. నామినేషన్లో ఓ పక్కన కుర్చీలో కూర్చున్నాడు. గేమ్స్ పెడితే ఏం ఆడుతాడ్రా బాబు అని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
![]() |
![]() |